- పార్లమెంట్ ఎన్నికల తర్వాత చుద్దామన్న బీఆర్‌ఎస్ కనిపించదు
- కేసీఆర్ అహంకారంతోనే 104 నుంచి 39కి పడిపోయింది
- మిగితా రాష్ట్రాల్లో ఆయనలా మాట్లాడితే ఉరి తీస్తారు
- ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్ బ్యూరో, ప్రజానావ: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ చుద్దామన్నా కనిపించదని, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని విమర్శించారు.
ఓటమిని ముందే గ్రహించి ఫ్రస్టేషన్‌లో ఇలా మాట్లాడుతున్నారన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖపై చర్చ జరిగినప్పడు ఇంట్లో పడుకొని.. ఇప్పుడు సిగ్గు.. శరం, లజ్జ అన్నీ వదిలేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా మాట్లాడితే ఉరి తీస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ అహంకారంతోనే బీఆర్‌ఎస్ పార్టీ 104 నుంచి 39 సీట్లకు పడిపోయిందన్నారు.
సూర్యాపేటకు వదిలింది కేవలం తాగునీరు మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కమీషన్ల కక్కుర్తితోనే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల కాస్త కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిందన్నారు.
ఈ కరువు తెచ్చింది ముమ్మాటికీ కేసీఆరేనని ఉత్తమ్ స్పష్టం చేశారు.అలాంటి పొగరుబోతును ఇంకెవరినీ చూడలేదన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు.