కోల్కతాలో భారీగా పట్టుబడిన బంగారం
కోల్కతాలో భారీగా బంగారం పట్టుబడింది. 14 కోట్ల విలువ చేసే 24.4 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఈస్టర్న్ గేట్‌వే ద్వారా కొందరు గుర్తు తెలియని దుండగులు అక్రమంగా బంగారం తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆపరేషన్ ఈస్టర్న్ గేట్‌వేతో బంగారం గుట్టును రట్టు చేశారు. బంగ్లాదేశ్ నుంచి నాటు పడవలో బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో అస్సాం, త్రిపుర, కోల్కతా, బంగాదేశ్ లకు చెందిన 8మందిని అరెస్ట్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.