14.4 కేజీల బంగారం సీజ్‌

0
34

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో బూట్ల మధ్యలో అక్రమంగా బంగారం తరలింపు

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.8కోట్లు విలువ చేసే 14.4కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం సీజ్ చేశారు. సూడన్ నుంచి షార్జా వెళ్లే 23మంది ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ 23 మంది ప్రయాణికులు తమ లగేజ్‌లతో పాటు వారు ధరించిన బూట్లలో బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి పై అనుమానం కలగడం తో వారిని క్షుణ్నంగా పరిశీలించారు కస్టమ్స్ అధికారులు. ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని షూ, పాదాల కింద, బట్టల మధ్య లో దాచి తరలించే యత్నం చేశారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. ప్రధానంగా నలుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. బంగారాన్ని ఎక్కడికి చేరవేస్తున్నారనే దానిపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here