exams: సజావుగా సాగుతున్న ‘పది’ పరీక్షలు

0
18

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన సిరిసిల్ల అదనపు కలెక్టర్లు


పదో తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి. సిరిసిల్ల గీతానగర్ జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మంగళవారం వేర్వేరుగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పరీక్షలు కొనసాగుతున్న తీరును వారు పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించి, అధికారులు పలు సూచనలు చేశారు.

పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని స్పష్టం చేశారు. ఇక్కడ డీఈఓ రమేశ్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here