ఒకే రోజు 10 సాధారణ కాన్పులు

0
2

వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అద్భుతం
వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఒకే రోజు 10 సాధారణ కాన్పులు చేయడం జరిగింది. ఇందులో ఆరుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరిండెంట్ మాట్లాడుతూ డెలివరీలో పాల్గొన్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. అలాగే మొదటి కాన్పులో నార్మల్ డెలివరీ అయి ఆడబిడ్డ జన్మిస్తే వాళ్లకు ఉయ్యాల ఇస్తున్నామని తెలియజేశారు. వేములవాడ, చుట్టుపక్క మండలాల ప్రజలు ఏరియా ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ రేగులపాటి మహేశ్‌ రావు, డా. చైతన్య సుధా, సంతోష్ చారి, తిరుపతి, బిందు, జ్యోతి, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు, హెడ్ నర్స్ స్టెల్లా, స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి, లక్ష్మీ దేవరకొండ, అరుణ్ సాయి, జ్యోతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here