గ్రూప్‌-2 వాయిదా వేయండి

0
2

– టీఎస్పీఎస్సీని ముట్టడించిన అభ్యర్థులు
ఓవైపు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే.. మరోవైపు గ్రూప్‌-2ను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు సోమవారం నాడు టీఎస్పీఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. పలుచోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు.

అయితే ఒకే నెలలో ఇటు గురుకుల పరీక్ష, గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించడంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే ప్రీపేర్‌ కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్‌-2 పరీక్షను మూడు నెలల వాయిదా వేయాలని కోరారు. గ్రూప్‌-2 సిలబస్‌. గురుకుల సిలబస్‌ వేర్వేరుగా ఉన్నాయని, ఒకే నెలలో పరీక్షలకు సన్నద్ధం కావడం కష్టమన్నారు. తమ సమస్యను అర్థం చేసుకొని వెసులుబాటు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here